CM Relief Fund | సీఎం సహాయనిది పేద‌ల‌కు వ‌రం..

CM Relief Fund | సీఎం సహాయనిది పేద‌ల‌కు వ‌రం..

CM Relief Fund | వరంగల్, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంగా నిలుస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య(Dr. Kadiyam Kavya) పేర్కొన్నారు. ఎన్నో వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందన్నారు.

రాష్ట్రంలోని రేవంత్ సర్కార్(Revanth Sarkar) ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా చేసుకొని ముందు అడుగేస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఉద్ఘాటించారు. హనుమకొండ, కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఈ రోజు సీఎం సహాయనిధి(CM Relief Fund) చెక్కులను డాక్టర్ కడియం కావ్య పంపిణీ చేశారు.

సీఎం సహాయనిధి కింద 11 మంది లబ్ధిదారులకు 6 లక్షల 25 వేల(6 lakh 25 thousand) విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరు సీఎం సహాయనిది పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందాలని సూచించారు.

సీఎం సహాయనిధి అందేలా కృషి చేసినందుకు డాక్టర్ కడియం కావ్యకు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply