MEDICAL| కాటూరి మెడికల్ కళాశాల సేవలు అభినందనీయం

కాటూరి మెడికల్ కళాశాల సేవలు అభినందనీయం
- ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు
MEDICAL| శావల్యాపురం, ఆంధ్రప్రభ: పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన కాటూరి మెడికల్ కాలేజ్ సేవలు అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో కాటూరి మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం వైద్య శిబిరంలో పాల్గొని వారు అందిస్తున్న ఉచిత సేవలను పరిశీలించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గ్రామస్తులకు వివిధ రకాల వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మెడికల్ కళాశాల సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
