3500 acres | ఒప్పందం లేకుండా పంటలు వేయొద్దు

3500 acres | ఒప్పందం లేకుండా పంటలు వేయొద్దు
3500 acres | టేకుమట్ల, ఆంధ్రప్రభ : ఈ యాసంగి సీజన్లో విత్తన ఏజెన్సీ లతో ఒప్పందం లేకుండా మొక్కజొన్న, వరి పంటలు వేసుకోవద్దని మండల వ్యవసాయ అధికారి కళ్యాణి రైతులకు సూచించారు. ఈ రోజు మండలంలో మొక్కజొన్న 3500 ఎకరాలు, వరి 6500 ఎకరాలు(3500 acres, paddy 6500 acres) రైతులు సాగు చేస్తున్నారని అన్నారు.
కాగ ఆసిరెడ్డిపల్లి గ్రామంలో విత్తన ఉత్పత్తి మొక్కజొన్న వరి సాగు చేస్తున్న రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కజొన్న వరి పంటలు సాగు చేసే రైతులు ఒప్పంద పత్రాలు చేసుకున్న తర్వాతనే మొక్కజొన్న వరి పంటలు సాగు చేయాలని అన్నారు.
ఎవరైనా నమ్మకంతో విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని తెలిపారు. మండలంలో మొక్కజొన్న వరి ఏజెంట్స్ గ్రామాలలో తిరిగి వేయించడానికి ముందుగా కొంత పెట్టుబడి సాయం రైతులకు ఇచ్చి రైతులకు వారి రైతులుగా నమోదు చేసుకుంటున్నారని అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడటం వల్ల పత్తి ఆశించిన దిగుబడి రాకపోవడం, రైతులు మొక్కజొన్న సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
అగ్రిమెంట్ ఇస్తేనే వరి మొక్కజొన్న పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. అగ్రిమెంటు(agreement) లేకుండా సాగు చేస్తే రైతులకు విత్తనం వల్ల పంట నష్టం వాటిల్తే న్యాయపరంగా లబ్ధి పొందలేరని, తప్పనిసరిగా అగ్రిమెంటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు భరత్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
