Jagtial | కొనుగోలు కేంద్రాలపై అదనపు కలెక్టర్ సమీక్ష

Jagtial | కొనుగోలు కేంద్రాలపై అదనపు కలెక్టర్ సమీక్ష

Jagtial | ఎండపల్లి ఆంధ్రప్రభ : ఎండపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీఎస్ లత (BS Latha) గురువారం పరిశీలించారు. ధాన్యం స్వీకరణ, తూకం విధానం, మాయిశ్చర్ పరీక్షలు, నిల్వ స్థితిగతులను ఆమె వివరంగా పరిశీలించి అధికారులతో చర్చించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లుల (Rice mills) కు తరలించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి ఎమ్మార్వో ఎడ్ల అనిల్ కుమార్, సివిల్ సప్లైస్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply