School | పాఠ‌శాల నిర్మాణానికి స‌న్నాహాలు…

School | పాఠ‌శాల నిర్మాణానికి స‌న్నాహాలు…

School | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్(Young India Integrated Residential) పాఠశాలల నిర్మాణానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి పట్టణంలో పాఠశాల నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని విశ్వ సముద్ర కన్స్ట్రక్షన్స్ కంపెనీ జనరల్ మేనేజర్ టి. మహీధర్(T. Mahidhar) ఈ రోజు టీజీఈడబ్ల్యూడీసీ అసిస్టెంట్(TGEWDC Assistant) ఇంజనీర్ గుండేటి వినయ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు.

శాంతిఖని – సుభాష్‌నగర్ బస్తీల మధ్య రెవెన్యూ శాఖ కేటాయించిన సుమారు 25 ఎకరాల స్థలాన్ని పరిశీలించిన జీఎం మహీధర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంతమైన వాతావరణం, నీటి లభ్యత వంటి సౌకర్యాలు ఉండటం వల్ల ఈ ప్రదేశం విద్యాభివృద్ధికి ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోనే మూడు పాఠశాలల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జీ ఎం స్పష్టం చేశారు. పరిశీలన కార్యక్రమంలో విశ్వ సముద్ర కన్‍స్ట్రక్షన్ కంపెనీ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply