MLA | ఆరోగ్యానికి శ్రేయస్కరం

MLA | ఆరోగ్యానికి శ్రేయస్కరం
MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఇప్ప పువ్వు లడ్డుతో అధిక పోషకాలు లభించి ఆరోగ్యానికి శ్రేయస్కారంగా ఉంటాయని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. ఈరోజు ఉట్నూరులోని ఐటీడీఏ కార్యాలయ సమీపంలో జైనూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోడసం రాధాబాయి నూతనంగా ఏర్పాటు చేసిన ఇప్పపువ్వు (మోవా) లడ్డు విక్రయ కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యతిరే కేంద్రాన్ని పరిశీలించి ఇప్పు లడ్డులను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ కేంద్రాన్ని ఉట్నూర్ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు . అక్కడ ఉన్న లడ్డులు, పచ్చడ్లు , ఐటిడిఎ ద్వారా తయారు చేయబడే సరుకులను మొదటి బోణీ చేశారు .గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరమైనవి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జై నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథరావు, ఆదిలాబాద్ ఆర్టిఏ నెంబర్ దూ ట రాజేశ్వర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు, దాస0డ్ల ప్రభాకర్, మరుసకొల తిరుపతి, కొత్తపెల్లి మహేందర్, భాగ్యలక్ష్మి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

