victims | నందన వనం మద్నూర్ పోలీస్ స్టేషన్

victims | నందన వనం మద్నూర్ పోలీస్ స్టేషన్

victims | డోంగ్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో మొక్కల పెంపకంతో పచ్చని తోరణంలా నిలుస్తోంది. మద్నూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు స్టేషన్ ఆవరణలో వివిధ రకాల మొక్కలు(Plants), నీడనిచ్చేచెట్లు, వివిద రకాల పూలమొక్కలు దర్శనమిస్తాయి.

మొక్కలు ఏపుగా పెరగడంతో అక్కడ ఎండ వేడిమి అనేది కనిపించదు. స్టేషన్ ముందుభాగంలో అన్ని కాలాల్లో పచ్చగా ఉండే వివిధ మొక్కలు, గులాబీ మొక్కలను నాటి వాటిని అందంగా తీర్చిదిద్దారు. అలాగే పెద్దపెద్ద చెట్లతో పాటు వాతావరణానీ అందిస్తున్నాయి. పోలీస్ స్టేషన్(Police station) ఆవరణలో పెద్దపెద్ద చెట్లు వివిధ సమస్యల పరిష్కారం కోసం స్టేషణ్‌కు వచ్చే బాధితులు(victims) వాటి కింద కూర్చొని సేద తీరుతున్నారు.

అయితే మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను స్టేషన్ సిబ్బంది(station staff) తీసుకోవడంతో నేడు మొక్కలు పచ్చని చెట్లుగా మారి స్టేషన్ నందనవనంగా కనిపిస్తుంది. ఎస్ ఐ విజయ్ కొండ(SI Vijaykonda) చెట్లను నాటడమే కాకుండా దానికి ప్రత్యేకంగా పెంపకానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీ పూల మొక్కలు నాటడంతో స్టేషన్ అల్హాదకరంగా కనిపిస్తుంద‌న్నారు.

Leave a Reply