Hyderabad | ఆత్మహత్యకు గల కారణం ఏమిటి?

Hyderabad | ఆత్మహత్యకు గల కారణం ఏమిటి?
Hyderabad | పినపాక, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలంలోని ఏడుల బయ్యారం అటవీ రేంజ్‌లో పనిచేస్తున్న తులసిరామ్(Tulsiram) బీట్ ఆఫీసర్ ఈ రోజు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి… పాల్వంచ మండలం జగన్నాధపురం (Jagannadhapuram గ్రామానికి చెందిన తులసీరామ్ మండలంలోని బందగిరి నగరంలో బీట్ ఆఫీసర్(Beat Officer)గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇటీవల నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్లిన తులసి రామ్ పురుగుమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వైద్యం కోసం హైదరాబాద్(Hyderabad) తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందాడు. తులసి రామ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
