Peddapalli | కారు ఢీకొని…

Peddapalli | కారు ఢీకొని…
Peddapalli | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి (Peddapalli) పట్టణం బందంపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు (car) ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గోదావరిఖనికి చెందిన కట్ల మల్లయ్య (Katla Mallaiah) అలియాస్ నాగరాజు పెద్దపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మరణించాడు. సంఘటనా స్థలానికి పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కపూర్ చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
