Medaram | దుచ్ఛర్యలకు పాల్పడితే…

Medaram | దుచ్ఛర్యలకు పాల్పడితే …
Medaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరైనా మేడారం(Medaram) సమ్మక్క-సారాలమ్మ(Sammakka – Saralamamma) మేడారం ట్రస్ట్ బోర్డును త్వరగా ఏర్పాటు చేయాలనీ తుడుందెబ్బ ములుగు జిల్లా అధ్యక్షులు పాయం కోటేశ్వరరావు(Payam Koteswara Rao) ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
గతంలో ప్రభుత్వం విస్మరిస్తూ జాతర సమయంలో మాత్రం తాత్కాలిక ఉత్సవ కమిటీలు వేసి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటుందని 2026లో జరిగే మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతర సమయం ఆసన్నమైతుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ట్రస్ట్ బోర్డ్ కమిటీ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.
జాతర సమయంలో ప్రజలు వేసే కానుకల రూపంలో వచ్చే డబ్బులు ఇండోమెంట్(Endowment) తీసుకోని ఆదివాసీ ప్రజలను, పూజారులను విస్మరిస్తున్నదని జాతరకు సంబంధించి ఐటీడీఏ నిధులు(ITDA funds) మంజూరు చేస్తే అట్టి డబ్బులు ఇండోమెంట్ ఐటీడీఏకు ఇవ్వకుండా మోసం చేస్తున్నదని ఈసారి ఇండోమెంట్ అధికారులు ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడితే తుడుందెబ్బ ఆధ్వర్యంలో జరిగే పరిణామాలకు ఇండోమెంట్ బాధ్యత వహించగా తప్పదని తుడుందెబ్బ ములుగు జిల్లా అధ్యక్షులు పాయం కోటేశ్వరరావు హెచ్చరించారు.
ఈసమావేశంలో గిరిజన అభ్యుదయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముద్దబోయిన రవి, అలుగుబెల్లి పూర్ణ, ములుగు నియోజకవర్గ అధ్యక్షులు కొప్పుల జగన్నదరవు, మహిళ జాక్ చైర్మన్ చేలా శమంతకమణి, మాల్కం రాధిక, తుడుందెబ్బ తాడ్వాయి మండల అధ్యక్షులు మోకాళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
