రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన సర్వేలో పాల్గొనని వారి వివరాలను నమోదు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు కుల గణన సర్వేలో పాల్గొనలేదని అధికారులు లెక్కతేల్చారు. దీంతో వారికోసం రీసర్వే నిర్వహించనున్నారు.
ఈ రీ-సర్వే రేపటి నుంచి (ఈ నెల 16 నుంచి) ప్రారంభం కానుంది. కుల గణన వివరాలను 28 వరకు నమోదు చేసుకోవచ్చని సూచించారు.
కుల గణన వివరాల నమోదు కోసం టోల్ ఫ్రీ నంబర్ 040-211 11111 ఏర్పాటు చేశారు. ఎన్యుమరేటర్లు కాలర్ ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. ఎంపిడిఒ కార్యాలయం, వార్డు కార్యాలయాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.