Muncipal | ఫ‌స్ట్ డే 902 నామినేషన్లు

ఫ‌స్ట్ డే 902 నామినేషన్లు

  • రేప‌టితో గ‌డువు పూర్తి

తొలిరోజు ఇలా..
ఈ ఎన్నికలలో తొలి దశగా నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నామినేషన్ల మొదటి రోజే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల మొదటి రోజే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న 2,996 వార్డుల కోసం 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్లు సమర్పించారు. వీటిలో వివిధ రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ల నుంచి కూడా నామినేషన్లు వచ్చాయి. తొలి రోజు కావడంతో తక్కువ సంఖ్యలో దాఖలయ్యాయి.

రేపటి తో గడువు పూర్తి…
మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ల డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులు నేడు కూడా నామినేషన్లను దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు రేపటి (శుక్ర‌వారం)తో గడువు ముగియనుంది. దీంతో నేడు అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీల అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది. అందుకే ఈరోజు, రేపు భారీగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.

నామినేష‌న్ వేయ‌డానికి అర్హ‌త ఏమిటంటే..?

  • మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి.
  • కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి.
  • మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేయాలంటే ఆ మున్సిపాలిటీలోని ఏదైనా ఒక వార్డులో ఓటరుగా నమోదు అయి ఉండాలి.
  • అలాగే కార్పొరేటర్‌గా పోటీ చేసే వారు సంబంధిత కార్పొరేషన్‌లోని ఒక డివిజన్‌లో ఓటరుగా ఉండాలి.
  • పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థికి ఒక ఓటరు ప్రతిపాదకుడిగా ఉండాలి.
  • స్వతంత్ర అభ్యర్థుల విషయంలో మాత్రం పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి.
  • ఒక ఓటరు ఒక్క అభ్యర్థినే ప్రతిపాదించాలన్న నిబంధనను ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
  • అభ్యర్థి ఆ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో కాంట్రాక్టరుగా ఉండకూడదు.
  • అలాగే కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయకమైన పదవుల్లో ఉండరాదు.
  • ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడిన వారు, గత ఎన్నికల్లో ఖర్చుల వివరాలు సమర్పించని కారణంగా అనర్హులైన వారు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయలేరు.