MINI BUS | మినీ బస్సు జప్తు… రూ.86,200 జరిమానా

MINI BUS | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు బెంగళూరు జాతీయ రహదారిలో నంద్యాల జిల్లాలోని అమకతాడు టోల్‌ప్లాజా వద్ద శనివారం ఉదయం మోటారు వాహనాల తనిఖీ అధికారి క్రాంతి కుమార్ బస్సులను తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ సాయి విష్ణు ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సు (ఏపీ 28 టి ఏ 3388)ను జప్తు చేశారు. అమకతాడు టోల్ గేట్ల దగ్గర డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. తనిఖీ అధికారులు వెంటాడి బస్సును నిలిపి వేశారు. ఆ ట్రావెల్ బస్సును తనిఖీ చేయగా, వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోవడం, ఏపీ టాక్స్ చెల్లించకపోవడం, డ్రైవర్‌కు హెవీ వాహనాల లైసెన్స్ లేద‌ని గుర్తించారు. ఈ ఉల్లంఘనలపై రూ. 86,200 జరిమానా విధించి బస్సును డోన్ ఆర్టీసీ డిపోకు తరలించినట్లు అధికారి క్రాంతి కుమార్ వెల్లడించారు.

Leave a Reply