Telangana | మత్స్యకారులకు అండగా ఉంటాం

Telangana | మత్స్యకారులకు అండగా ఉంటాం
మంత్రి ప్రభాకర్
Telangana | హుస్నాబాద్, ఆంధ్రప్రభ : మత్స్యకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువులో శనివారం 5.17 లక్షల రూపాయలతో 3 లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari), రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ లు హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 165 చెరువులకు గాను 38 లక్షల 92 వేల ఉచిత చేప పిల్లలు విడుదల చేయనున్నారన్నారు. ఈ పథకం వల్ల నియోజకవర్గంలో 4,144 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్య కారులను ఆర్థికంగా బలోపేతం చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్యశాఖ కీలకంగా మారేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.
ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే వారికి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (Group Accident Insurance) పాలసీ తీసుకొచ్చి 5లక్షల రూపాయలు బీమా కల్పిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ అందజేయడం జరుగుతుందన్నారు. ఇక నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు 03 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ అందించడం జరిగిందన్నారు. త్వరలో వెటర్నరీ హాస్పిటల్ నూతన భవనాన్ని నిర్మించి అధునాతన వెటర్నరీ హాస్పిటల్ నిర్మించ తలపెట్టామన్నారు. అసంపూర్తిగా ఉన్న మోడర్న్ చేపల మార్కెట్ ను పూర్తి చేయాలని, అక్కన్నపేట మండలం ఏర్పడిన తరువాత హుస్నాబాద్ వెటర్నరీ డాక్టర్ పోస్టులేదని, త్వరలోనే మంజూరు చేస్తామన్నారు.
గురుకులాల్లో మటన్, చికెన్ (Mutton, chicken) లాగా చేపల మెనూ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపద అభివృద్ధి గోపాల మిత్ర లు రైతుల శ్రేయస్సు, అభివృద్ధికి కృషి చేస్తున్నాయన్నారు. ఎల్లమ్మ చెరువుకు వచ్చే ప్రాంతాన్ని టూరిజం హాబ్ గా డెవలప్ చేస్తామని, గీత, రజక, పద్మశాలి, గొల్ల, కురుమ, ముదిరాజ్, గంగపుత్రులు ఇతర బలహీన వర్గాల సమస్యలు పరిష్కారానికి సైతం కృషి చేస్తామన్నారు. అక్కన్న పేట ఫోర్ లైన్ రోడ్డుకు రూ.50 కోట్లు మంజూరు చేశామని, మహా సముద్రం గండి టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మెన్ మెట్టు సాయి కుమార్ (Mettu Sai Kumar) మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువుల్లో చేపలు వేస్తున్నామని, హుస్నాబాద్ కు ఇప్పుడు 3లక్షల చేప పిల్లలు ఇచ్చామని, మత్సకారుల విజ్ఞప్తి మేరకు ఇంకో 60వేల చేప పిల్లలు ఇవ్వనున్నామన్నారు. చెరువులు, రొయ్యలు కూడా పెంచేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 5లక్షల మత్స్య కారుల కుటుంబాలు ఉన్నాయన్నారు. 6వేల మత్స్యకారుల సొసైటీలు ఉన్నాయని, 26వేల చెరువులున్నాయని, దాదాపుగా 123కోట్ల రూపాయలతో చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీకి విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, తదితర నేతలు హాజరై పంపిణీ చేశారు.
