- క్షుద్రపూజలు ఆనవాళ్లతో జనం బేజారు
కుక్కునూరు (ఆంధ్రప్రభ) : ఏలూరు జిల్లా కుక్కునూరు (kukkunuru) మండలంలో క్షుద్రపూజల (Horror scenes) ఆనవాళ్లు వెలుగు చూసాయి. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (government junior college) ప్రాంతంలో క్షుద్రపూజలు ఆనవాళ్లు ఉన్నాయి. శుక్రవారం ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు ( students afraid )ఆనవాళ్లను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పసుపు, కుంకుమ,తలవెంట్రుకలు, (hair) మెడ కోసిన కోళ్లను (Hen heads)చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఉలికి పడ్డారు. ముగ్గు బొమ్మను కళాశాల అధ్యాపక బృందం పరిశీలించారు.

