Cantonment | ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Cantonment | ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
అంగన్వాడి కేంద్రంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిన కాంగ్రెస్ నేత జంపన
Cantonment | కంటోన్మెంట్, ఆంధ్రప్రభ | భారత మొట్టమొదటి ప్రధాని చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం చిల్డ్రన్స్ డే సందర్భంగా కంటోన్మెంట్ ఒకటవ వార్డు న్యూ బోయినపల్లి బాపూజీనగర్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్ అంగన్వాడి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ (Jampana Pratap) ముఖ్య అతిధిగా హాజరై అంగన్వాడీ పాఠశాలల్లో కేక్ కట్ చేశారు. చిన్నారులకు చాక్ లెట్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. అనంతరం బాపూజీనగర్ ప్రభుత్వ పాఠశాల్లో జరిగిన కార్యక్రమంలో క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జంపన ప్రతాప్ బహుమతులు అందజేశారు.
చిన్నారులను నెహ్రు గులాబీతో పోల్చేవారని, అందుకే ఎల్లప్పుడూ నెహ్రూ (Nehru) గులాబీ ధరించేవారన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ స్వప్న, సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ ఉపాధ్యాయులు హేమలత, బస్తీ అధ్యక్షుడు అశోక్, స్థానికులు రామరావు, హరికృష్ణ, బాపూజీనగర్ పాఠశాల హెచ్ఎం ఆశీర్వాదం, పద్మావతి మేడం, సరితా, శోభారాణి, ఆర్తి, అనిత హరనాధ రావు, విద్యార్థుల తల్లిదండ్రులు వరప్రసాద్, శ్రీకాంత్, ముకేశ్ యాదవ్, పవన్, పాల్గొన్నారు.
