Bihar | బీహార్ లో.. ఎన్డీయే యమ స్పీడ్

Bihar | బీహార్ లో.. ఎన్డీయే యమ స్పీడ్
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్) బీహార్ ఎన్నికల ఫలితాల్లో (in bihar) ఎర్లీ ట్రెండ్స్ లో ఎన్డీయే కూటమి (nda leading) 136 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, ఎంజీబీ 69 సీట్లలో ముందంజలో ఉంది. ఎంజీబీ కూటమిలో ప్రధాన పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ (rjd)) ఇప్పటివరకు 46 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ (congress) కేవలం 7 సీట్లలో ముందంజలో ఉంది. ఎన్డీయే భాగస్వామి జేడీయూ( jdu) 35 సీట్లలో ముందంజలో ఉంది. జెఎస్పీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రస్తుతం జన్ సురాజ్ పార్టీ ( jsp) మూడు కీలక స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. చన్‌పటియాలో త్రిపురారి కుమార్ తివారీ అలియాస్ మనీష్ కశ్యప్ (tk tiwari) చైన్‌పూర్ లో హేమంత్ కుమార్ చౌబే, ( choube) కర్గాహర్ లో రితేష్ రంజన్ (ritesh ranjan)ఆధిక్యంలో ఉన్నారు.

