దారుణ హత్య…
దారుణ హత్య…
పాత కక్షలు నేపద్యంలో హత్య..
అక్రమ సంబంధం వ్యవహారమే కారణమా?..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా (Nandyal district)లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మహబూబ్ బాషా (30) అనే వ్యక్తిని దుండగులు హత్య చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు.
బుధవారం తెల్లవారి సరికి ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది. వ్యక్తి మరణంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు (CI Venkateswara Rao), ఎస్సై రమేష్ బాబులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దుండగులు మారణాయుధాలతో దాడి చేశారని తెలిపారు. ఆ దాడికి మహబూబ్ బాషా అక్కడికక్కడే మృతి చెందాడు.
దీనికి పాత కక్షలే కారణమా మరి ఏమైనా కోణం ఉందా ? అన్న రీతిలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. లేక అక్రమ సంబంధం వ్యవహారమా?.. అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో హత్యలు జరుగుతున్నాయి. పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

