మానసిక బలాన్ని పెంచుకోవాలి..

మానసిక బలాన్ని పెంచుకోవాలి..

  • పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలి..
  • రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, ఆంధ్రప్రభ : పోలీసులు తమ సమస్యలను నమ్మకంగా ఒకరికొకరు పంచుకోవడంతోపాటు అవసరమైతే సహాయం కోరడం ద్వారా మానసిక బలాన్ని ఎంపొందించుకోవచ్చని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా(Police Commissioner Amber Kishore Jha) అన్నారు.

ఈ రోజు రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు సిబ్బందికి వ్యక్తిగత భద్రత, స్వీయ క్రమశిక్షణ, ప్రవర్తనా నియమావళిపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ ముఖ్య అతిథిగా హాజరై సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ పోలీస్ శాఖ సిబ్బంది నిరంతరం ప్రజా సేవలో, నేర నిరోధక కార్యక్రమాల్లో నిమగ్నమై అధిక పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, చెడు అలవాటువంటి కారణాలతో కొంతమంది సిబ్బందిలో మానసిక ఆందోళన, నిస్పృహ పెరిగే అవకాశం ఉందన్నారు.

పోలీసు సిబ్బందిలో వ్యక్తిగత భద్రతా ప్రమాణాలు, మానసిక స్థైర్యం(mental stability), స్వీయ క్రమశిక్షణ, విధి నిర్వర్తనలో ప్రవర్తనా నియమావళి పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో పోలీస్ కమీషనర్ ప్రత్యేక చొరవతో వైద్య నిపుణులు సహాయంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వర్తనలో శారీరక, మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతత, సహనం పాటించడం, సహచరుల మధ్య పరస్పర గౌరవం, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం వ్యవహారించాలన్నారు.

పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలంటే వ్యక్తిగత స్థాయిలో క్రమశిక్షణ, ప్రవర్తనా ప్రమాణాలు అత్యంత అవసరమని సూచించారు. ఒత్తిడి, నిరాశ, నిస్పృహలను(stress, depression, and anxiety) ఎదుర్కొనే పద్ధతులు, ఆత్మహత్య ఆలోచనలు రాకుండా మానసిక బలాన్ని పెంపొందించే మార్గదర్శ‌కాలు సిబ్బంది మధ్య పరస్పర సహకారం కౌన్సిలింగ్ ప్రాముఖ్యత, సేవా స్ఫూర్తి, కుటుంబ సమతౌల్యం, వ్యక్తిగత సంతోషం మరింత మెరుగవుతుందన్నారు.

స్వీయ క్రమశిక్షణ(self-discipline), ఆచరణలో సమన్వయం, వ్యక్తిగత జీవనశైలి, కుటుంబ సమతుల్యత వంటి అంశాలపై నిపుణులు ప్రత్యేక సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివా స్, ఎంవిఐ సంతోష్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్(Special Branch ACP Nagendra Goud), ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సైకాలజిస్ట్ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, సిసి వారీష్, ఆర్ఎస్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply