మసీదులను ఎందుకు కూల్చలేదు?
- దారి మైసమ్మ దేవాలయాలను కూల్చడం దారుణం
- పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఇటీవల తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం రాష్ర్ట ప్రభుత్వం తక్షణమే అందించాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గుజ్జుల రామకృష్ణా రెడ్డి(Gujjula Ramakrishna Reddy) డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ రోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల కారణంగా లక్షలాది మంది రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రదాన మంత్రి ఫసల్ బీమా(Pradana Mantri Fasal Bima) రాష్టంలో అమలు చేసి ఉంటే రైతులకు నష్టం వచ్చేది కాదని, రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(Cotton Corporation of India) పూర్తి స్థాయిలో సిద్ధమైందన్నారు.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 122 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దళారులను నమ్మి రైతులు పంటను తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికార యంత్రంగాన్ని రంగంలోకి దింపి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన ప్రతి గింజకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో రోడ్డు విస్తరణ పేరుతో 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు(dismantled officials) మసీదులను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు.
ఈ సమావేశంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శులు పల్లె సదానందం, కడారి అశోక్ రావు, నాయకులు రాంసింగ్, నారాయణ స్వామి, శివంగారి సతీష్, శనిగరపు రమేష్, శిలివేరు ఓదెలు, పర్శ సమయ్య, జంగా చక్రదర్ రెడ్డి, అక్కపల్లి క్రాంతి, బెజంకి దిలీప్, ఫహీమ్, కొమ్ము తిరుపతి, కూకట్ల నాగరాజు, రాజేంద్ర ప్రసాద్, జగన్, బండ కరుణాకర్, సందీప్, వేల్పుల లక్ష్మినారాయణ, కుక్క వంశీ, సోడా బాబు, నూనెటి వెంకటేష్, వేల్పుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
