యువ శాస్ర్త‌వేత్త‌లుగా ఎద‌గాలి…

యువ శాస్ర్త‌వేత్త‌లుగా ఎద‌గాలి…

దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ద్వారక కాంప్లెక్స్(Dwarka complex) ప్రధానోపాధ్యాయులు చిన్న నర్సయ్య మాట్లాడుతూ.. విజ్ఞాన శాస్త్ర విషయాలను విద్యార్థులకు వివరించి బోధించడంతో వారికి సులువుగా అర్థమైతదని అన్నారు.

విద్యార్థులకు చిన్ననాటి నుంచి సైన్స్ వేర్(Science Wear) ప్రయోగాలు చేపిస్తు శాస్త్రీయ దృక్పథం అలవాటు అవుతుందని వారు యువ శాస్త్ర వేత్తలు(oung scientists)గా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోలిశెట్టి బుచ్చన్న, ఉపాధ్యాయురాలు శ్యామల, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వరూప, అంగన్వాడీ టీచర్ లక్ష్మీ, ప్రి ప్రైమరీ ఇన్స్ట్రక్షర్ ధనలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply