హస్తం గూటికి మైనార్టీలు

- కండువా కప్పి స్వాగతించిన మంత్రి దామోదర్
సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 9 (ఆంధ్రప్రభ): మంత్రి దామోదర్ రాజనర్సింహ నేతృత్వం లో 200 మంది మైనారిటీలు హస్తం గూటికి చేరారు. ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో ఎర్రగడ్డ డివిజన్ లోని ఇమ్రాన్ ఖురేషి ఆధ్వర్యంలో ప్రేమ్ నగర్ , బి.శంకర్ లాల్ నగర్ లకు చెందిన 200 మంది మైనారిటీలు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ పార్టీ జెండా కప్పి కార్యకర్తలను స్వాగతించారు. ఈ సందర్భంగా పలువురు మైనారిటీ నాయకులను మంత్రి అభినందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీగణేష్, చైర్మన్లు తాహేర్, వెంకట్రామ్ రెడ్డి, పలువురు మైనారిటీ నేతలు పాల్గొన్నారు.
