బాలాజీ సేవలో అంబానీ

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రిల‌య‌న్స్ అధినేత‌

తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : తిరుమల శ్రీవారిని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున స్వామి వారి మేల్కొలుపు సేవ సుప్రభాత సేవలలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ‌ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఈఓ వెంకయ్యచౌదరీ,ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం,రిసెప్షన్ డిప్యూటీ ఈఓ భాస్కర్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply