టెన్షన్ లో రైతులు..

టెన్షన్ లో రైతులు..
నల్గొండ, ఆంధ్ర ప్రభ:
దేవుడు కనికరించినా పూజారి కనకరించలేదు అన్నట్టుగా.. తయారైంది నల్లగొండలో రైతుల పరిస్థితి. నల్లగొండ లారీల కాంట్రాక్టర్ల నిర్వాహకంతో జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేల బస్తాలు నిల్వ ఉన్నాయని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. గత కొన్ని రోజుల నుండి వర్షం వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులకు గురైయ్యారు. దీంతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ప్రతి రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీలు చేస్తూ ఉన్నత అధికారులకు రైతులను ఇబ్బంది పెట్టొద్దని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలి అన్నారు. లారీ కాంట్రాక్టర్లు స్పందించకపోవడంతో.. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వేసిన ధాన్యం నిల్వ ఉంటున్నాయి. వాతావరణం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అనే భయంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు, కలెక్టర్ ఆదేశాలు పాటించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు.
