21st century | నాయకా.. మరీ ఇంత వల్గరా..

21st century | నాయకా.. మరీ ఇంత వల్గరా..

  • తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో భాష ఇష్యూ
  • స‌భ‌లు స‌మావేశాల్లో అసభ్యకర ప‌దాలు
  • పంచులు, సామెతల ప్లేసులో బూతు మాట‌లు
  • తిట్టుకోవ‌డ‌మే నాయ‌కుల ల‌క్ష్యం
  • గలీజ్ మాట‌ల‌తో ప‌రువు బ‌జారు
  • చదువుకున్నవాళ్లు పాలిటిక్స్ లో రావాల‌ని డిమాండ్‌

21st century | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పాలిటిక్స్.. ఒక డెమోక్రటిక్ నేషన్ కు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక దేశాన్ని నడిపించేది. మన హ్యూమన్ బాడీలో బ్లడ్ వెసెల్స్ ఎంత ఇంపార్టెంటో ఒక దేశానికి పాలిటిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక చోట బ్లడ్ వెసెల్స్ బ్లాక్ అయితే ఆ పార్ట్ మొత్తం పనికి రాకుండా పోతుంది. అప్పుడు ఆ ఆర్గాన్ నే తీసేయాలి. సరిగ్గా అలాగే మన ఇండియాలో ఏ స్టేట్ లో అయినా పాలిటిక్స్ ఫెయిల్ అయినా.. కరప్ట్ అయినా.. ఆ స్టేట్ మొత్తం ఫెయిల్యూర్ లోకి వెళిపోతుంది. సరిగ్గా మన తెలుగు రాష్ట్రాల్లోనూ అదే జరుగుతోంది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని పాలిటిక్స్ లో మెయిన్ ఇష్యూ ఒకటుంది.

అదే వల్గర్ లాంగ్వేజ్. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉండే భాషపై నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాలో చాలా ఆర్టికల్స్ వచ్చాయి. మనం ఎక్కువగా తెలుగు పేపర్లే చదువుతాం కానీ.. ఒకసారి నేషనల్ పేపర్స్ హెడ్డింగ్స్ ను మనం చదివితే.. టైమ్స్ ఆఫ్ ఇండియా Once Known For Decorum, Now Curse Words Dominate In Andhra Pradesh అని రాస్తే,.. Dirty tongue syndrome needs to change అని హన్స్ ఇండియా రాసుకొచ్చింది. ఇలా మనం గమనించకపోయినా.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హేట్ స్పీచ్ పై నేషనల్ మీడియా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. మరి అసలు దీనికి ఈ పంథా ఎలా వచ్చింది? చూద్దాం.

ఒకప్పుడు అంటే కొన్ని డికేడ్స్ మనం వెనక్కి వెళితే.. అప్పట్లో నీలం సంజీవరెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి.. వీరంతా మన రాజకీయాలను హుందాతనంగా నడిపినవారే. ఒకప్పుడు అసెంబ్లీ మొదలైందంటే చాలు.. పంచులు, సామెతలతో దద్దరిల్లిపోయేది. ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఒక వీడియో ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు బీజేపీలో ఎంపీగా ఉన్న ఈటల రాజేంద్ర ఒకప్పుడు టీఆర్ఎస్ లో ఉండేవారు. అప్పుడు ఆయనపై పట్టుమని పది సీట్లు కూడా రాలేదు రాజేంద్రా… నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని అసెంబ్లీలో వైఎస్ అన్నారు. ఈ మాటలో ఎక్కడా వల్గారిటీ లేదు. బూతులు లేవు. కానీ.. ఒక్కమాటతో విపక్షాల నోరు మూయించగలిగారు. కొణిజేటి రోశయ్ చంద్రబాబును ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ‘మీరు నన్ను డ్రామా ఆర్టిస్టు అని అనవద్దు.. నేను ఎప్పుడూ డ్రామాలు వేయలేదు.

కనీసం స్టేజిపై వెనుక వరుసలో కత్తి పట్టుకుని కూడా నిల్చోలేదు’ కాబట్టి నన్ను డ్రామా ఆర్టిస్టు అని పొగడవద్దని సెటైరికల్ గా మాట్లాడారు. మరోసందర్భంలో.. చంద్రబాబుగారూ.. నేను మీ అంత తెలివైన వాడిని కానులెండి.. మీ తెలివి ఏపాటిదో అంటూ సెటైరిక్ గా.. ఎన్టీఆర్ ను గద్దె దింపిన విషయాన్ని ఎత్తి చూపారు. ఈ విధంగా ఒకరిపై మరొకరు సెటైర్లు వేస్తూ.. అందరినీ నవ్విస్తూనే విపక్ష పార్టీలు చేసిన తప్పులను ఎత్తి చూపారు. ఇది చాలా హుందాతనంగా ఉండేది. కానీ.. ఆ తర్వాత మరీ ముఖ్యంగా 21 శతాబ్దంలో ఎంటర్ అయ్యేసరికి పాలిటిక్స్ లో వల్గర్ లాంగ్వేజ్ వచ్చి చేరింది.

కొంతమంది నాయకులు ఈ లాంగ్వేజ్ ను ఆధారంగా చేసుకునే పాలిటిక్స్ లో ఎదిగారంటే పరిస్థితి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. హుందాతనం ఉండాల్సిన రాజకీయాల్లో లుచ్చా, లఫంగా, చెత్తనాకొడకా ఇలా ఒక్కటేమిటి.. అమ్మాయిగా నేను పలకలేనివి.. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే స్ట్రైక్స్ పడేంత వల్గర్ గా ఉంటుందీ మన నేతల భాష. తెలంగాణ నాయకులైతే దీన్ని వాళ్లకు వాళ్లు సమర్థించుకునే పని కూడా చేస్తున్నారు. మా తెలంగాణ యాస ఇలాగే ఉంటుందనీ.. మేం ఇలాగే మాట్లాడుతామని చెబుతున్నారు. వీళ్లు చెప్పేదాన్ని బట్టి చూస్తే తెలంగాణ యాస అంటేనే బూతులుంటాయన్న రీతిలో మాట్లాడుతారు. కానీ.. ఎప్పుడైనా తెలంగాణ యాస అంటే బూతులు కాదు. ఒక అందమైన యాస. అందులో సామెతలు, పిట్టకథలు, ఆప్యాయత, అనురాగం అన్నీ కలిసిన యాస. అలాంటిదాన్ని పట్టుకుని ఈ రాజకీయనాయకులు తమ స్వార్థం కోసం గలీజ్ గా మాట్లాడుతున్నారు. ఏపీలోనూ తక్కువేం కాదు.. కొంతమంది రాజకీయ నాయకులు చాలా గలీజ్ గా.. ఉమ్మికంటే తెల్లది.. వెచ్చనైనది అనే రీతిలో మాట్లాడారంటే మామూలు విషయం కాదు. దీన్ని అడ్డుకోవాల్సిన నేతలే ఎంకరేజ్ చేస్తున్నారు. జనరల్ గా మన దేశంలో డర్టీ పాలిటిక్స్ అంటే ఒకప్పటి యూపీ, బీహార్ గుర్తొచ్చేవి. ఆ రాష్ట్రాల్లో 1990, 2000 కాలంలో రౌడీ రాజ్యం నడిచేది. అప్పుడు కూడా అక్కడ బూతులు మాట్లాడింది లేదు. ప్రజలను దోచుకున్నారే తప్ప.. ఇంత దారుణంగా తిట్టిందిలేదు. కానీ.. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సిట్చ్యువేషన్ ఏర్పడింది.

అయితే ఈ పరిస్థితి ఎలా వచ్చిందని చెప్పుకోవాలంటే.. కోడి ముందా.. గుడ్డు ముందా.. అన్నట్లుగా ఉంటుంది. వాళ్లు అన్నారు కాబట్టి తాము అంటున్నాం అనే రీతిలో నాయకులు చెబుతున్నారు. ముందుగా వారిని ఆపితే తానూ ఆపుతానని చెబుతున్నారే తప్ప.. ఏ ఒక్క నాయకుడూ.. తాము ఆపేస్తున్నాం.. మీరు కూడా ఆపేయండని సవాలు విసిరిందిలేదు. ఈ పంథా చాలా అసభ్యకర స్థాయికి చేరుకుంది. టీవీ ఛానెల్ లో వార్తలను చూడాలంటేనే ఏ నాయకుడు ఎప్పుడు బూతులు మాట్లాడుతారో అని భయపడే స్థితి ఏర్పడింది. చిన్న పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో ఇలాంటివి మాట్లాడితే.. వాళ్లు కూడా అవే నేర్చుకుంటారు. గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్నవ్యక్తి ఇలా మాట్లాడారంటే వారినే పిల్లలు రోల్ మోడల్ గా తీసుకునే అవకాశముంది. దీంతో ఇకపై ఈ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేవారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.

జస్ట్ నేతలేనా.. ఇటు మీడియా పరిస్థితీ అలాగే తయారైంది. జర్నలిజంలో విలువలు ఉంటాయి. ఆ విలువల్లోనే ఈ వల్గర్ లాంగ్వేజ్ ను ఉపయోగించకపోవడం కూడా ఉంటుంది. ఇలాంటి భాషను ఏ వ్యక్తి మాట్లాడినా.. ప్రభుత్వ అధినేత అయినా.. దాన్ని ప్లే చేయకూడదు. మరీ తప్పనిసరైతే బీప్ సౌండ్ అయినా వేయాలి. ఎక్కడా దీని గురించి రాయకూడదు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజకీయ నాయకులు ఎవరైనా బూతులు తిట్టినప్పుడు వివాదమైతే ఆ వివాదం ఎలా మొదలైందో చెప్పాలంటే దీన్ని కచ్చితంగా వినిపించాల్సిన పరిస్థితి వచ్చేసింది. పీపుల్ కూడా రాను రానూ దానికే అలవాటు పడిపోతున్నారు. నార్మల్ గా విమర్శలు చేస్తే ఎవరూ పట్టించుకోని పరిస్థితి వచ్చేసింది. బూతులు మాట్లాడితేనే సెన్సేషన్ అవుతోంది. ఈ సెన్సేషనలిజం కల్చర్ పెరిగిపోయి.. అటు పొలిటీషియన్స్, ఇటు మీడియా మొత్తం తీరునే మార్చేస్తోంది.

ఈ పంథా ఎలా మొదలైందంటే.. ఒకప్పుడు రాజకీయాల్లో విజ్ఞావంతులు ఉండేవారు. ఎన్టీఆర్, రోశయ్య, రాజశేఖరరెడ్డి.. వీళ్లంతా రాజకీయాల్లో కిందిస్థాయి నుంచి ఎదిగిన నేతలు. అందుకే హుందాతనాన్ని పాటించారు. దీంతో పాటు ఎప్పుడైతే తెలివైన వాళ్లు పాలిటిక్స్ లోకి వస్తారో.. అప్పుడు వాళ్లు అపోజిషన్ ను టాకిల్ చేయడానికి సెటైరికల్ కామెంట్స్ కానీ.. వాళ్లకు మించి కంటెంట్ తీసుకుని విమర్శలు చేస్తారు. కానీ.. ఇప్పుడున్న నాయకుల్లో అంతటి తెలివైన వాళ్లు ఎక్కడ? తమపై ఎవరైనా అలిగేషన్స్ చేస్తే దాన్ని ఎలా తిప్పికొట్టాలి అన్నది ఆలోచించే టైం వీళ్లకు ఎక్కడ ఉంది? ఎప్పుడైనా కానీ.. టాకింగ్ పవర్ లేని వ్యక్తులే బూతులు సంధిస్తారు. అలాంటి నేతలు ఎక్కువ కావడంవల్లే ఈ సంస్కృతి పెరిగిపోయింది.

ఈ కల్చర్ ను మార్చాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరు? మార్చడానికి ఎవరు ముందుకు రావాలి? ఈ ప్రశ్నకు సమాధానం.. ఎవరికి వారే అని చెప్పాలి. ఇప్పటివరకూ పొలిటీషియన్స్ అంతా తాము ఎందుకు ఆపాలి? అవతలి నేత తమను తిడుతుంటే.. మేం అంతకు రెండు బూతులు ఎక్కువే తిడుతాం అని చెబుతున్నారు. కానీ.. మేం మొదట ఆపేస్తున్నాం.. ఇకపై నుంచి ఇలా ఎవరూ మాట్లాడవద్దు. మేం కూడా మాట్లాడం అని సవాల్ విసరగలిగే నేతలుండాలి. అప్పుడే ఈ తీరు మారుతుంది. ఈ బూతులన్నీ ఆగిపోయి సక్రమైన భాష రాజకీయాల్లో ఎంటర్ అవుతుంది. అప్పుడు ఈ సెన్సేషనలిజం కల్చర్ మీడియాను కూడా వదిలిపోతుంది. ఎవరైనా స్ట్రాంగ్ సెటైర్ వేస్తే వారినే పీపుల్ ఫాలో అయ్యే సిట్యువేషన్ వస్తుంది. అప్పుడు కదా.. మన రాజకీయాలు క్లీన్ గా మారేది. అందుకే చదువుకున్నవాళ్లు పాలిటిక్స్ లో రావాలి. సరిగ్గా చదువుకున్నవాళ్లెవరూ బూతులు మాట్లాడరు. దేశాన్ని ఎలా డెవలప్ చేయాలి అన్నదే ఆలోచిస్తారు. అప్పుడే మన దేశం బాగుపడుతుంది. మన దేశం బాగుపడితే మనమూ బాగుపడుతాం.

Leave a Reply