అమరావతి నిర్మాణానికి కొత్త ఊపు !

అమరావతి, ఆంధ్రప్రభ : రాజధాని నిర్మాణానికి మరోసారి ఊపునిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమరావతి అభివృద్ధి కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (NaBFID) రూ.7,500 కోట్ల రుణం అందించడానికి ముందుకు వచ్చారు.
రుణం మంజూరుకు సంబంధించిన పత్రాలను శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు డా. పొంగూరు నారాయణ సమక్షంలో సీఆర్‌డీఏ కమిషనర్ కె. కన్నబాబుకు NaBFID ప్రతినిధులు అందజేశారు.
ఈ సందర్భంగా NaBFID డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్, రుణాలు & ప్రాజెక్టు ఫైనాన్స్ విభాగ వైస్ ప్రెసిడెంట్ కె. దినేష్ పాల్గొన్నారు. అమరావతి నిర్మాణానికి ఈ రుణం మంజూరు కావడం రాష్ట్ర రాజధాని అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త ఊపునిచ్చే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.
