హోరా హోరీ..

హోరా హోరీ..
ములుగు, (ఆంధ్రప్రభ)
ములుగు జిల్లాలోని జాకారం సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 11 జోనల్ లెవెల్ క్రీడలు హోరాహోరీగా జరుగుతున్నాయి. పాఠశాల ప్రిన్సిపల్ ఏ వెంకటేశ్వర్లు, పీడీ వెంకట్ రెడ్డి, పాఠశాల స్టాఫ్ సెక్రెటరీ యాదగిరి, డీసీఓ భిక్షపతి, అసిఫాబాద్ ప్రిన్సిపల్ బి.యాదగిరి ఆధ్వర్యంలో క్రీడా పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గురువారం నుంచి జరుగుతున్న క్రీడా పోటీలలో ఇప్పటికే పలు పాఠశాలల టీంలు గెలుపొందాయి. ప్రస్తుతం మంథని సోషల్ వెల్ఫేర్ పాఠశాల, ఏటూర్ నాగారం పాఠశాలల మధ్య బాల్ బ్యాడ్మింటన్ క్రీడ కొనసాగుతుంది. దీనితో పాటు అండర్ 17 వాలీబాల్, అండర్ 14 కబడ్డీ క్రీడలు సాగుతున్నాయి.
