లెక్కలు తేలుతున్నయ్!

లెక్కలు తేలుతున్నయ్!
- పల్లెల్లో ఉపాధి తనిఖీలు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మా గాంధీ(Mahatma Gandhi) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సామాజిక తనిఖీ బృందాలు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోతనిఖీలు చేపడుతున్నారు. ఊట్కూర్ మండల పరిధిలోని ఎడవెల్లి, మొగ్దుంపూర్, లక్ష్మీ పల్లి గ్రామాల్లో గురువారం సామాజిక తనిఖీ గ్రామసభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధి హామీ ఏపీవో లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ సామాజిక తనిఖీ(Social Inspection) బృందాలకు ప్రజలు కూలీలు సహకరించాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వివిధ పనులు చేపట్టిన వివరాలు అధికారులకు వివరించాలన్నారు. ఊట్కూర్ మండలంలో 1-4-2024 నుంచి 31-3-2025 వరకు చేపట్టిన పనులకు సామాజిక తనిఖీ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
మండలంలో రూ 4 కోట్ల 37 లక్షల 58864 నిధులతో పనులు చేపట్టగా కూలీలు 4 కోట్ల 16 లక్షల 74171, పనులు చేపట్టగా మెటీరియల్(Material) పనులు 24 లక్షల 24 వేల 693 నిధులతో పనులు పూర్తి చేసినట్లు వివరించారు. సామాజిక తనిఖీ గ్రామ సభల్లో ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఆర్పి కుమార్, ఈసీ మైపాల్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు మనీషా, రవీందర్, గ్రామపంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్, జగదీష్, భాస్కర్ పాల్గొన్నారు.
