లోత‌ట్టు బిక్కు బిక్కు

లోత‌ట్టు బిక్కు బిక్కు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిక


కె.వి.బి.పురం, నవంబర్ : తిరుపతి (Tirupati) జిల్లా కె.వి.బి.పురం మండలంలోని ఓళ్లూరు రాయల్‌ చెరువుకు గండి పడడంతో పరిసర గ్రామాల్లో నీటి ప్రవాహం తీవ్రంగా పెరిగింది. చెరువు నుంచి ఉధృతంగా వస్తున్న వరద నీరు కళత్తూరు, రాజులకండ్రిగ, పాతపాలెం గ్రామాల దిశగా మళ్లీ లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది.

ప్రస్తుతం చెరువులోని నీరు వేగంగా బయటకు పొంగిపోతుండటంతో ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని (People should be vigilant), ఏర్లు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని పుత్తూరు రూరల్‌ సీఐ హెచ్చరించారు. సీఐ బృందం సంఘటనా స్థలంలోకి చేరుకుని పరిస్థితే పరిశీలిస్తూ, సహాయక చర్యలు ప్రారంభించింది. మరోవైపు జిల్లా కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులు మండలానికి రానున్నట్లు సమాచారం. పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజల భద్రత కోసం సన్నద్ధంగా ఉన్నారు.

Leave a Reply