ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు…

ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు…

గద్వాల, ఆంధ్రప్రభ : గద్వాల జిల్లా‌ కేంద్రంలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ(Hit the divider) కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గద్వాల పోలీసులు తెలిపిన వివరాలా ప్రకారం.. గద్వాల పట్టణ కేంద్రానికి చెందిన నాగరాజు (36), నరేష్(38), కిరోష్ ముగ్గురు స్నేహితులు. ఈ రోజు సుమారు 3 గంటల 45 నిమిషాల సమయంలో జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకుని తిరిగి గద్వాల టౌన్ కు వస్తున్న క్రమంలో గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో మీనాక్షి లాడ్జ్ సమీపంలో బైక్ ఓవర్ స్పీడ్ తో వస్తూ అదుపుతప్పి డీవైడర్ ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో నరేష్, నాగరాజు సంఘటన స్థసం కర్నూల్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు బైక్ పై అతి వేగంగా రావడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన నరేష్, నాగరాజు, తీవ్రంగా గాయపడిన కిషోర్ ఈ ముగ్గురు వృత్తిరీత్యా పెయింటర్ పనులు చేస్తూ జీవనం సాగించే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నామని కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శ్రీనివాస్ తెలిపారు.

Leave a Reply