నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు

నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు

నెల్లూరు ప్రతినిధి ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై దాడులు చేపట్టింది.ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ స్టోన్ హౌస్ పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఇంచార్జ్ ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతూ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

కార్యాలయ తలుపులు మూసివేసి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. కార్యాలయం తలుపులు మూసివేశారు. రిజిస్టర్లను రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ లలో వసూళ్లు చేశారని ఆరోపణలు అధికం కావడంతో డీఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు చేపట్టారు. కొంత నగదు సొమ్ము కూడా దొరికినట్లు సమాచారం. పూర్తి వివరములు తెలియవలసి ఉంది. కార్యాలయంలో పలికి ఎవరిని రానీయకుండా గేటు వద్ద బందోబస్తు ఉంచారు.సోదాలు కొనసాగుతున్నాయని వివరాలు తదుపరి తెలుపుతామని ఇంచార్జ్ డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు.

Leave a Reply