రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు
రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు
రంగారెడ్డి : బీజాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మొయినాబాద్ మండల (Moinabad mandal) పరిధిలోని తాజ్ సర్కిల్ వద్ద జరిగింది. సమాచారం ప్రకారం… హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు రోడ్డు ఇరుకుగా ఉండటంతో అదుపు తప్పి మర్రిచెట్టును ఢీకొట్టింది.
ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకుల్లో నలుగురికి స్వల్ప గాయాలు కాగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
