శాశ్వత పరిష్కారం చూపాలి..

శాశ్వత పరిష్కారం చూపాలి..
వర్షాలకు నీరు నిల్వ లేకుండా చర్యలు
ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, (ఆంధ్రప్రభ) :
నాగర్ కర్నూల్ పట్టణంలో వర్షపు నీరు నిల్వకుండా అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మునిసిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మున్సిపల్ ఉన్నతాధికారులు, శాఖాధికారులు పాల్గొన్నారు. పట్టణంలో వర్షపు నీరు చేరిన ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించేందుకు రోడ్ల పై నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.శాశ్వత మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇకముందు ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల అండగా నిలిచి త్వరితగతిన స్పందించాలని అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ ఉన్న గృహల యాజమానులు వర్షం నీరు రాకుండా చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే ను కోరారు. అధికారులు వెళ్లి చూసి సమస్యలు పరిష్కారం చేయాలి అని ఎమ్మెల్యే ఆదేశించారు.
