ఎంసీ బాటిల్లో నత్త…

ఎంసీ బాటిల్లో నత్త…
- వినియోగదారుడు షాక్…
- ప్రాణాలతో చలగాటం ఆడుతున్న కల్తీ మద్యం
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారుడు
తాంసీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ఎక్సయిజ్ శాఖ నాణ్యమైన మద్యం విక్రయాలు చేపడుతున్నామని చెపుతున్నప్పటికీ అవి నీటి ముఠాలుగా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) తాంసీ మండలంలో కల్తీ మద్యం వినియోగదారులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. మండల కేంద్రంలోని వైన్స్ లో ఓ వ్యక్తి ఈ రోజు కొనుగోలు చేసిన ఎంసీ బ్రాండ్ మద్యం బాటిల్ లో నత్త కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. బాటిల్ మూత తీసి మద్యం తాగబోతుండగా అందులో అడుగుభాగాన నత్త తేలుతూ కనిపించడంతో ఆయన కంగుతిన్నాడు.
- మద్యం నాణ్యత పై అనుమానాలు..
ఈ ఘటనతో మండలంలో మద్యం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన మద్యం పేరుతో వైన్స్ ల(Wines)లో నకిలీ, కల్తీ సీసాలు అమ్మకానికి వస్తున్నాయనే ఆందోళన వ్యాప్తి చెందింది. స్థానికులు మద్యం సరఫరా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
- ఆరోగ్యానికి ముప్పుగా కల్తీ మద్యం..
గ్రామస్థులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మద్యం నాణ్యతను తరచుగా పరిశీలించాలని ఎక్సైజ్ శాఖను డిమాండ్ చేస్తున్నారు. కల్తీ మద్యం వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఈ వైన్స్ పరిస్థితి ఇలా ఉంటే జిల్లా ఇలా ఎన్ని వైన్స్ లలో కల్తీ మద్యం(Adulterated Liquor) సరఫరా అవుతుందో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సయిజ్ అధికారులు సత్వర చర్యలు తీసుకోని కల్తీ మద్యాన్ని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
