ఇందిరమ్మ ఇల్లు మంజూరు చెయ్యరా..

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చెయ్యరా..
- పింఛన్ ఇప్పించారా…!
గుండాల, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామనికి చెందిన ఓ నిరుపేద వితంతువు బీసు సత్తమ్మ(Beesu Sattamma) (75)పెంకుటిల్లులో గత 60 ఏండ్లుగా నివాసం ఉంటుంది. భర్త వీరయ్య 4 ఏండ్ల క్రితమే మృతిచెందాడు. ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలు, భారీ వర్షాలకు పెంకుటిల్లు కాస్త శిథిలావస్థకు చేరి వర్షాలకు కురిసి ఇల్లు పూర్తిగా తడిసి ఇంటిలోకి వర్షపు నీరు చేరింది.
దీంతో ఆమె నిరాశ్రయులయారైంది. ఇందిరమ్మ ఇళ్ల(Indiramma’s houses) కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికి ఇల్లు మంజూరు కాలేదు. గత 4 ఏండ్లుగా పింఛన్ కూడా రావడం లేదు. భర్తకి గీతకార్మికుల పింఛన్ రాగా.. ఆయన మృతిచెందడంతో వితంతువు పింఛన్ మంజూరు కావడం కష్టమని స్థానిక ఎంపీడీఓ, డిఆర్ డిఓ(MPDO, DRDO)లు తేల్చిచెప్పడంతో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ ఇప్పించాలని బాధితురాలు వేడుకుంటుంది.
