కుల్కచర్లలో దారుణం. అసలు ఏం జరిగింది..?

కుల్కచర్లలో దారుణం. అసలు ఏం జరిగింది..?

(ఆంధ్రప్రభ, కుల్కచర్ల)…
కుల్కచర్ల మండల కేంద్రంలో దారుణం జరిగింది. అనుమానం, కుటుంబ కలహాల నేపథ్యంగా వ్యక్తి భార్య, కూతురు, వదినను దారుణంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కూతురు తృటిలో ప్రాణాలతో తప్పించుకుంది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో జరిగింది.


మండల కేంద్రానికి చెందిన వేపూరి యాదయ్య (38) తన భార్య వేపూరి అలివేలు (32), వదిన హనుమమ్మ (40), పెద్ద కూతురు అపర్ణ 13), చిన్న కూతురు శ్రావణి (20) శనివారం భోజనాలు చేసి పడుకున్నారు. మధ్యరాత్రి యాదయ్య కొడవలితో భార్య, వదిన, ఇద్దరు కూతుర్ల పై కత్తితో దాడి చేశాడు. పెద్ద కూతురుకు తలకు గాయం కావడంతో స్పృహ తప్పింది. తాను కూడా చనిపోయిందని భావించిన యాదయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్పృహలోకి వచ్చిన పెద్ద కూతురు పెద్ద నాన్న వద్దకు వెళ్ళి చెప్పగా ఘటన విషయం బయటకు వచ్చింది. అనుమానం, కుటుంబ కలహాల నేపథ్యంలో హత్యలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిగి డిఎస్పీ శ్రీనివాస్ సంఘటన స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పెద్ద కూతురు ఆసుపత్రికి తరలించారు. ఆమె నుంచి వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. క్లూస్ టీం ఆధ్వర్యంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply