ప్రజా ప్రభుత్వం వెంటే ప్రజలు..

ప్రజా ప్రభుత్వం వెంటే ప్రజలు..

రహమత్‌నగర్‌, (ఆంధ్రప్రభ) : ప్రజా నాయకుడు, ప్రజల మనిషి నవీన్‌ యాదవ్‌ గెలుపుకు అందరు ఏకమై శాయశక్తులా కృషి చేస్తామని రహమత్‌ నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ గెలుపుకు రహమత్‌నగర్‌ డివిజన్‌లో కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ శ్రేణులంతా ఏకమై ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నామని, నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం వెంటే నియోజకవర్గ ప్రజలంతా ఉన్నారని, భారీ మెజార్టీ అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Leave a Reply