అభివృద్ధి లక్ష్యం …

అభివృద్ధి లక్ష్యం …

 ముందుకు సాగుతాం

– సర్పంచ్ అభ్యర్థి మస్కు అలవేణి నరసింహారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబర్ 3 (ఆంధ్రప్రభ): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మస్కు అలవేణి నరసింహారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుధవారం ఉదయం ఆంధ్రప్రభ బృందం కొండాపూర్ మండల కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా.. ఆంధ్రప్రభ బ్రోచర్ ను స్థానికులు, అభ్యర్థి మస్కు అలవేణి నరసింహారెడ్డితో కలిసి ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ.. కొండాపూర్ మండల కేంద్రంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. తమ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తే తమ గెలుపు నల్లేరు మీద నడికేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలింగారెడ్డి, లియాకత్ అలీ, మోయిన్, ఎం. లియాకత్ అలీ, ఎం శంకర్, ఎం ఆంజనేయులు, మహబూబ్ అలీ, ఎండి ఇస్మాయిల్, పిఎసిఎస్ చైర్మన్ మాణిక్ రెడ్డి, ఎన్ వెంకటేశం, సారా షౌకత్ అలీ, ఎన్ విటల్, కే శ్రీశైలం, పార్టీ కార్యకర్తలు, నరసింహారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.