వందల ఎకరాల్లో పడిపోయిన వరి చేలు

వందల ఎకరాల్లో పడిపోయిన వరి చేలు
హుజూర్ నగర్, ఆంధ్రప్రభ : రైతులు ఆరుగాలు కష్టించి కంటికి రెప్పలాగా కాపాడుకున్న పంట పొలాలు మొoథా తుఫాన్(Mootha Typhoon) కారణంగా తమ కళ్ల ఎదుటనే నీటి పాలవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తుఫాన్ రైతన్నకు గుండె కోత మిగిల్చింది. మొoథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు, ఈదురు గాలులు రావడంతో వరి చేలు నేలకొరిగాయి. హుజుర్‌నగర్ పరిధిలో వందల ఎకరాల్లో వరి పొలాలు నేలకొరిగాయి.
మరి కొద్ది రోజుల్లో వరి పంట చేతికొచ్చే పరిస్థితి ఉన్న క్రమంలో వరుణ దేవుడు మొoథా తుఫాన్ రూపంలో రైతుల పంటను కవలించింది. ఫలితంగా రైతాంగం(Farmer) తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. నిన్నిరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు దానికి తోడు ఈదురు గాలులు రావడంతో పొట్ట దశలో ఉన్న వరి చేలు పూర్తిగా పడిపోయాయి.
మరి కొద్ది రోజుల్లో కోతకు వచ్చే పంట చేలు సైతం నేలకొరిగాయి. పడిపోయిన పంట పొలాల మీద నుండి వర్షపు నీరు పారుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పంట పొలాలు(crop fields) పడిపోవడంతో గింజలు తాలుగింజలుగా మారిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గింజ పోసుకున్న పంట పొలాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. దీనితో పంట పూర్తిగా పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
మరి కొద్ది రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు(Weather Department officials) ప్రకటిస్తున్న క్రమంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో సకాలంలో వర్షాలు రావడంతో పంట పొలాలు పెద్దగా చీడపీడరు లేకుండా మంచి దిగుబడి వచ్చే విధంగా ఉన్నాయని రైతులు తెలిపారు.
తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు పూర్తిగా పడిపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయకట్టు ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే పంట పొలాలు చేతికొచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈలోగా తుఫాన్ కారణంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయ అధికారులు పరిశీలన చేయాలి..
నియోజకవర్గ(Constituency) వ్యాప్తంగా పడిపోయిన పంట పొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలన చేయాలని రైతులు కోరుతున్నారు. పంట రక్షణకు సరైన సూచనలు అందజేయాలని రైతులు కోరుతున్నారు. వర్షాలు మరి కొద్ది రోజులు కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
