ఏనుగుల భీకర దాడి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో పంటపొలాలు ధ్వంసం
(ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి) : తిరుపతి జిల్లా (Tirupati District) చంద్రగిరి మండలంలో ఏనుగులు (Elephants) స్వైర విహారం చేశాయి. భీమవరం, కొండ్రెడ్డి కండ్రిగలో పంటపొలాలను తొక్కాయి. వరి చేలను, అరటి, టేకు చెట్లను ధ్వంసం చేశాయి. భయాందోళనతో ఆయా గ్రామాల ప్రజలు ఉరుకులు పెట్టారు.

