Celebrations| ప్రజావేదికలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Celebrations| అనంతపురం, ఆంధ్రప్రభ : దేశ ప్రజలందరికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం అందిస్తూ రూపొందించబడిన భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు పురస్కరించుకొని రాజ్యాంగ దినోత్సవ వేడుకను కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజా వేదిక వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం పట్టణంలోని సర్కిల్లో ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు చౌలం మల్లికార్జున, మార్కెట్ యార్డు చైర్మన్ గోళ్ళ లక్ష్మీదేవి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కోనంకి రాజశేఖర్, సింగిల్ విండో అధ్యక్షులు మల్లిపల్లి నారాయణ, మాజీ జడ్పీటీసీ కొల్లాపురప్ప, రాష్ట్ర తెలుగుయువత కార్య నిర్వాహక కార్యదర్శి అనిల్ చౌదరి, కౌన్సిలర్ అబ్రహం, మాజీ కౌన్సిలర్ గోపాల్, మాజీ సర్పంచులు రామాంజనేయులు, కొత్తపల్లి గోవింద రెడ్డి, డిష్ మురళి, శ్రీనివాసులు, తలారి సత్తి, సునీల్, కిష్టప్ప, కామక్కపల్లి నాగరాజు, క్లస్టర్ ఇంచార్జ్ లు టీకేబీ ఇస్మాయిల్, మహేష్, కునే సాయినాథ్, ఇటుకల రామాంజనేయులు, వడ్డే నాగరాజు, రామన్న, పెద్దన్న, శ్రీనివాసులు, రామాంజనేయులు, పాపన్న, శ్రీరాములు, గోవిందు, విరుపాక్షి, మారుతి, శ్రీరాములు, నవీన్, ముత్యాలు, వన్నూరుస్వామీ, తిప్పేస్వామి, తిమ్మారెడ్డి, నాగప్ప, ప్రసాద్, మాబు, అన్వర్, ప్రియ, రమణ, ఇమామ్ వాళ్లు, మంజు తదితరులు పాల్గొన్నారు.