మాగంటి సునీతను గెలిపించండి

మాగంటి సునీతను గెలిపించండి

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వార్డుల ఇన్‌చార్జి కల్లూరి రాంచంద్రా రెడ్డి అన్నారు.

ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక సందర్భంగా బోరబండ డివిజన్ లోని 344, 354 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపే ల‌క్ష్యంగా ఇంటింట ప్రచారం చేశారు. ప్రజలను కలుసుకుని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, స్థానిక బూత్ ఇంచార్జ్‌లు, యువజన విభాగం నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply