నిజాంపేటలో బంద్ ప్ర‌భావం

నిజాంపేటలో బంద్ ప్ర‌భావం

నిజాంపేట, ఆంధ్ర‌ప్ర‌భ : బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిజాంపేట(Nizampet)లో బంద్ కొన‌సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ(BJP, BRS, CPI) నాయకులు మద్దతు ఇచ్చారు. బంద్ ప్ర‌భావంతో నిజాంపేట‌లో వెల‌వెల‌బోతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు.

అనంతరం గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ మండల అధ్యక్షుడు మౌవురం రామచంద్రం(Mauvuram Ramachandram), వివిధ పార్టీల నాయకులు రంజిత్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్(Veldurthi Venkatesh Goud), శ్రీనివాస్, మావురం రాజు, గరుగుల శ్రీనివాస్, బాలా గౌడ్, సిద్ధరాంరెడ్డి, మహేష్ గౌడ్, కొమ్మట సుధాకర్, చంద్రయ్య, ఫాజిల్ ,అబ్దుల్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply