వినతిపత్రం అందజేస్తున్న టీజేఎస్ నాయకులు
వినతిపత్రం అందజేస్తున్న టీజేఎస్ నాయకులు
నర్సంపేట, ఆంధ్రప్రభ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలనే టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్(Ambati Srinivas) డిమాండ్ చేశారు. నర్సంపేట ఆర్డిఓ కార్యాలయం అధికారికి టీజేఎస్(TJS) నాయకులు ఈ రోజు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో, విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై అనేక సంవత్సరాలు జరిగిన ఉద్యమాలను గుర్తించి సమగ్ర కులగణన చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం(state government) 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిందని, రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లును ఆమోదించకుండా అనేక రోజుల నుండి పెండింగ్లో పెట్టిందని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లు(42 percent reservations) రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చకుండా, పార్లమెంటులో ఆమోదించ కుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని శ్రీనివాస్ ఆరోపించారు. దీంతో బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు లేక తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్లోని 9 లో రిజర్వేషన్లను చేర్చి బీసీలకు న్యాయం చేయాలి ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్, గుంటి రామచందర్, సోల్తి సాయికుమార్, ఎండి మహబూబ్అలీ, సందాని గుంటి సంజీవలు పాల్గొన్నారు.
