అతడి రాక కోసం రికార్డుల ఎదురుచూపులు..
భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. మరో వారం రోజుల్లో (ఈ నెల 19 నుంచి) ప్రారంభం కానున్నఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు టీమిండియా యువ సంచలనం శుభ్ మాన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌తో టీమిండియా స్టార్ ఆటగాళ్ళు మరోసారి మైదానంలోకి అడుగు పెట్టనున్నారు.
అయితే అభిమానుల దృష్టి ప్రధానంగా రన్ మెషిన్ విరాట్ కోహ్లీపైనే ఉంది. హిట్ మ్యాన్ రోహిత్‌తో కలిసి టీ20తో పాటు సుదీర్ఘ టెస్ట్ ఫార్మాట్ వీడ్కోలు పలికిన కోహ్లీ, వన్డే ఫార్మాట్‌లో రికార్డుల వేటకు సిద్ధమయ్యాడు. దీంతో అతని రాక కోసం పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి.. ఈ సిరీస్‌లో విరాట్ పలు ముఖ్యమైన రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ సిరీస్‌తో పాటు రాబోయే మ్యాచ్‌లలో విరాట్ త్వరలో సాధించే ముఖ్యమైన రికార్డులు ఇక్కడున్నాయి.
విరాట్ కోహ్లీ రికార్డు మైలురాళ్లు..
- కోహ్లీ ఇప్పుడు వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండో స్థానానికి చేరడానికి కేవలం 53 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో సచిన్ టెండుల్కర్ (18426) తో ఉండగా.. రెండో స్థానంలో కే.సీ. సంగక్కర (14234) ఉన్నారు.
- ‘చేజ్ మాస్టర్’గా పేరు గాంచిన కోహ్లీకి విజయవంతమైన వన్డే ఛేజ్‌లలో 6,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలవడానికి కేవలం 2 పరుగులు మాత్రమే అవసరం.
- అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించడానికి కోహ్లీ తదుపరి 26 ఇన్నింగ్స్‌ల్లో 401 పరుగులు కావాలి.
- అంతేకాకుండా, విదేశీ గడ్డపై వన్డేల్లో సెంచరీ సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో విదేశీ మైదానాల్లో 30 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించనున్నాడు.
- వన్డేలు, టీ20ఐ కలిపి అన్ని పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడానికి కోహ్లీకి కేవలం 67 పరుగులు అవసరం.
- మొత్తానికి గిల్ కెప్టెన్సీలో భారత్, ఆస్ట్రేలియాపై పట్టు సాధించాలని చూస్తుండగా.. కోహ్లీ తన బ్యాట్‌తో రికార్డుల వేటను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు.
- గిల్ కెప్టెన్సీలో టీమిండియా, ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుండగా.. కోహ్లీ తన బ్యాట్‌తో రికార్డు బద్దల కొట్టే వేటను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు.
