పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్(Nagar Kurnool) జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ(Vamsi Krishna) అధ్యక్షతన ఏర్పాటు చేసిన నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ(డీసీసీ) నూతన అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఈ రోజు చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏఐసీసీ(AICC) పరిశీలకుడు, పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి(Narayana Swamy)ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి(Vijay Kumar Reddy), మోతీలాల్ నాయక్, పర్వత్ రెడ్డి, తక్కళ్ళపల్లి శేఖర్, కొయ్యల పుల్లయ్య(Koyyala Pullaiah), కడారి శ్రీనివాస్ యాదవ్, పాండు నాయక్, రమేష్ నాయక్ తదితరులు ఉన్నారు.