కళ్యాణదుర్గంలో కూటమి నేతల వేడుక

( అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ) : దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన (Narendra Modi’s birthday) వేడుకలను కళ్యాణదుర్గం పట్టణం ఎమ్మెల్యే కార్యాలయం (MLA’s office) ప్రజావేదికలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు (MLA Surendra Babu) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికీ తలవంచనిధీరుడు, ప్రపంచ దేశాలు గర్వించదగిన నాయకుడు నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకను టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Jana Sena) నాయకుల సమక్షంలో జరపటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు.
