ఇక ఎర్రచందనం స్మగ్లర్లకు చిచ్చు..

  • ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి : ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ దొరికిన స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షలు జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి మంగళవారం తీర్పు నిచ్చారు. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్ ఎల్ సుబ్బారాయుడి ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోచేసిన కేసులు , కోర్టులో విచారణ దశలోని కేసులపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలుగూరి అమర నారాయణ పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. తిరుపతి జిల్లా నాగపట్ల వెస్ట్ బీట్, చీకిమానుకోన పరిధిలో తమిళనాడు, విల్లుపురానికి చెందిన ఎల్. సేతు ను అరెస్ట్ చేశారు.

క్రైమ్ నెంబరు 28/2016 కేసులో ఈ నిందితుడి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు అతడిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులోని అతి విలువైన సహజ సంపద ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడం, అడవిలోకి అక్రమంగా ప్రవేశించే నేరస్తులకు ఇది ఒక హెచ్చరిక అని టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ తెలిపారు.

Leave a Reply