అడ‌విశ్రీ‌రాంపూర్‌లో ప్ర‌యోగాత్మ‌కం

మంథని , ఆంధ్ర‌ప్ర‌భ : అంత‌ర్జాతీయ స్థాయి (International level)లో అడ‌వి గ్రామాల‌ను తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం ముంద‌డుగు వేస్తోంది. అడ‌వి బిడ్డ‌ల‌కు ఐటీ విద్య (IT education) అందించాల‌ని దృఢ సంక‌ల్పంతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా అడవి శ్రీరాంపూర్‌ను ఏఐ శ్రీరాంపూర్ గా మారేలా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Duddilla Sridhar Babu) వ‌డివ‌డి అడుగులు వేస్తున్నారు. ఏఐ విద్యను అందించేందుకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అడవిశ్రీరాంపూర్ (Adivusrirampur) జిల్లా పాఠశాలను ఎంపిక చేశారు. ఇందుకు అవ‌స‌ర‌మైన టీ ఫైబర్ (T Fiber) ద్వారా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ల్యాబ్, సీసీటీవీ సర్వేలెన్స్ సిస్ట్‌మ్‌ను ఏర్పాటు చేశారు.

ఇంటింటికి ఇంట‌ర్నెట్‌
ఇంటింటికీ ఇంటర్నెట్ (Internet) సౌకర్యం కోసం రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో అడవి శ్రీరాంపూర్ ను ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. గ్రామంలో టీ ఫైబర్ ద్వారా రూ.1.28 కోట్లతో ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించారు. అడవి శ్రీరాంపూర్ పాఠశాలలో అదనపు తరగతుల భవనం, మరమ్మతు, సౌకర్యాల కోసం రూ.30 లక్షలను మంజూరు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నిధుల‌తో మౌలిక వ‌స‌తలు క‌ల్పిస్తారు.

విద్యారంగంలో స‌రికొత్త విధానం
చదువుకున్నవారు ఎక్కడ ఉంటే అక్కడ మరికొంతమందిని చదువుకున్న వాళ్లను తయారు చేయవచ్చు అనే విధానంతో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీ‌ధ‌ర్ బాబు ముందుకు వెళుతున్నారు. విద్యారంగం అభివృద్ధి కోసం ఐటీ రంగాన్ని ఉపయోగించుకొని, విద్యా రంగంలో సరికొత్త విప్లవం తీసుకు రావ‌డం కోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మంథని నియోజకవర్గం (Manthani constituency)లో డ్రీమ్ స్టార్ట్ రైజ్ అనే ఇన్నోవేషన్ సంస్థ (Innovation organization)ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని విద్యార్థులలో వినూత్న ఆలోచనలను వెలికి తీయాలని ఉద్దేశంతో టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. డ్రీమ్ స్టార్ట్ రైజ్ ఇన్నోవేషన్ నెట్‌వ‌ర్క్‌ సంస్థ ప్రతినిధులు మంథనిలోని పలు ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఐటీ రంగం గురించి అవగాహన కల్పిస్తున్నారు.

అడవి ముద్దుబిడ్డ …
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు – జయశ్రీ దంపతులకు ఆరుగురు సంతానం. అందులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఒక‌రు. మంథని నియోజకవర్గంలోని మారుమూల అటవీ ప్రాంతమైన ధన్వాడ మంత్రి శ్రీధర్ బాబు స్వస్థలం. అడవి ప్రాంతం నుండి ఐటీ శాఖ మంత్రిగా ఎదిగిన శ్రీధర్ బాబు ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ఒక ప్రాంతం బాగుపడాలంటే విద్యనందించాలని ప్రతిసారి ఆయన ప్రసంగంలో వింటూనే ఉన్నాం. ఆ ప్రసంగాన్ని నిజం చేసి విద్య రంగంలో ఐటీ రంగాన్ని కలగలిపి నూతన విప్లవాన్ని సృష్టించ‌బోతున్నారాయ‌న‌!

అంత‌ర్జాతీయ స్థాయిలో…
అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా అడవిశ్రీరాంపూర్ ను ఏఐ శ్రీరాంపూర్ మారుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్ర‌క‌టించారు. అడవిశ్రీరాంపూర్ జెడ్పీ పాఠశాలలో టీ ఫైబర్ ద్వారా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్, సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్ను టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్, కలెక్టర్ కోయ శ్రీహర్ష (Collector Koya Sriharsha)తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.

Leave a Reply