భారీ వర్షాలతో..

కామారెడ్డి, సెప్టెంబర్ 12 (ఆంధ్రప్రభ) : కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో ఈనెల 15న జరగనున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ (BC Declaration success meet) వాయిదా పడినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. భారీ వర్షాల కారణంగా సభ వాయిదా వేయడం జరిగిందన్నారు. సభ నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గమనించాలని సూచించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని తెలిపారు.
